అర్జున్‌ తెందూల్కర్‌కు దక్కని చోటు 

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ వేలానికి ముందు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో పేరు...

Updated : 11 Feb 2021 11:07 IST

ముంబయి: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ వేలానికి ముందు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో పేరు నమోదు చేసుకున్న అతను.. విజయ్‌ హజారె వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబయి సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం ముంబయి క్రికెట్‌ సంఘం బుధవారం 22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబయి సీనియర్‌ జట్టుకు ఎంపికైన అర్జున్‌.. ఆ టోర్నీలో రాణించలేకపోయాడు. ఆడే అవకాశం వచ్చిన ఒక్క మ్యాచ్‌లోనూ రెండు ఓవర్లు వేసిన అతను 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. దీంతో విజయ్‌ హజారె ట్రోఫీ జట్టు నుంచి అతణ్ని తప్పించారు. 

ఇవీ చదవండి..

టాస్‌ ఓడితే ఇంగ్లాండ్‌ పని అంతే..!

‘ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని