Updated : 12 Feb 2022 14:31 IST

IPL-2022 Auction : ఐపీఎల్ వేలం.. పాఠాలు నేర్చుకుంటున్న ఆర్యన్, సుహానా ఖాన్‌..!

బెంగళూరు: ఐపీఎల్‌ మెగా వేలం శనివారం బెంగళూరులో ప్రారంభమైంది. కప్పు తెచ్చే ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. తమ తమ వ్యూహాలతో సిద్ధమై వేలంలో పాల్గొంటున్నాయి. మరోవైపు ఇదే వేదికపై జట్టు యాజమాన్యాలు తర్వాతి తరానికి బాటలు వేస్తున్నాయి. దానిలో భాగంగా ఆర్యన్‌ ఖాన్, సుహానా ఖాన్, జాహ్నవి మెహ్తా.. వ్యాపార పాఠాలు నేర్చుకునేందుకు వచ్చారు. 

ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌)కు బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, జూహీ చావ్లా యజమానులు. ఆర్యన్, సుహానా.. షారుక్ పిల్లలు కాగా, జాహ్నవి.. జూహీ చావ్లా కుమార్తె. ఆ జట్టు యాజమాన్యానికి తర్వాతి తరం వీరు. ఈ ముగ్గురు వారసులు తాజాగా జరుగుతోన్న వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. వేలం ప్రారంభానికి ముందు కేకేఆర్‌ సీఈవోతో ఆర్యన్‌, సుహానా, జాహ్నవి మాట్లాడుతున్న ఫొటోను ఆ జట్టు ట్విటర్ వేదిక పంచుకుంది. ‘ఐపీఎల్‌ వేలం వ్యూహాలలో క్రాష్‌ కోర్సు. తర్వాతి తరానికి పాఠాలు చెప్తోన్న సీఈఓ’ అంటూ వ్యాఖ్యను జోడించింది. నిన్న కూడా వీరు వేలానికి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ మెగా వేలంలో షారుక్‌ ఖాన్‌ కన్పించకపోవడం గమనార్హం.  

గత ఏడాది అక్టోబర్‌లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. ఆ కేసులో జైలుకు వెళ్లిన అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడే మొదటిసారి బయట కనిపించాడు.  గతేడాది కూడా ఆర్యన్ కేకేఆర్ టేబుల్ వద్ద దర్శనమిచ్చాడు. కానీ సుహానా పాల్గొనడం ఇదే మొదటిసారి. 


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని