Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ సంబరాలు..
విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్టుల్లో చాలా రోజుల తర్వాత శతకం నమోదు చేశాడు. దీంతో తనదైన స్టైల్‌లో వేడుకలు చేసుకున్నాడు.
ఇంటర్నెట్‌డెస్క్ : పరుగుల వీరుడు.. రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ(Virat Kohli).. టెస్టుల్లో తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. దాదాపు 1200 రోజుల అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌లో శతకం నమోదు చేశాడు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలకు ఈ ఇన్నింగ్స్‌తోనే సమాధానం చెప్పాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) నాలుగో టెస్టు(IND vs AUS)లో శతకం పూర్తి చేయగానే.. స్టేడియం అంతా ‘కోహ్లి.. కోహ్లీ’ అంటూ మారుమోగింది.
సెంచరీ పూర్తి చేయగానే కోహ్లీ బ్యాట్‌తో ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఆ తర్వాత తన లాకెట్‌ను ముద్దు పెట్టుకుని ఆకాశం వైపు చూస్తు సంబరాలు చేసుకున్నాడు. ఇక కోహ్లీకి సహచర ఆటగాళ్లతోపాటు.. ఆసీస్ ఆటగాళ్లూ చప్పట్లతో అభినందనలు తెలపడం విశేషం. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి కూడా కోహ్లీకి అభినందనలు తెలియజేశాడు. ‘అతడి వెనక 600 కేజీల గోరిల్లా ఉంది. ఈ సాయంత్రానికి అతడు మరో రెండు అంగుళాల పొడవు పెరుగుతాడు’ అంటూ ప్రశంసించాడు.
సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ(Virat Kohli)కిది 28వ శతకం కాగా.. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 75వ సెంచరీ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: ఇమ్రాన్‌పై ఉగ్రవాదం కేసు.. పార్టీపై నిషేధానికి పావులు?
-
General News
Weather Forecast: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు
-
Sports News
IND vs AUS 2nd ODI : విశాఖ వన్డేలో ఆసీస్ విశ్వరూపం.. 11 ఓవర్లలోనే ముగించేశారు!
-
Politics News
Pawan Kalyan: అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారు: పవన్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
MLC Kavitha: దిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. రేపటి విచారణపై ఉత్కంఠ!