Sky: మిస్టర్ 360.. ఆ సూర్యుడిలా నిరంతరం ప్రకాశిస్తుంటాడు: ఆశిశ్ నెహ్రా
భారత యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్‌గా ఎంపికైన నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు సూర్యుడిలా నిరంతరం ప్రకాశిస్తుంటాడని నెహ్రా అభివర్ణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మండే సూర్యుడిలా నిరంతరం ప్రకాశిస్తుంటాడని మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా అభివర్ణించాడు. 2022 సంవత్సరానికి ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్‌గా మిస్టర్ 360 ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించే సూర్య అన్ని ఫార్మాట్లలోనూ మంచి ప్రదర్శన చేయగలడని నెహ్రా తెలిపాడు.
‘‘ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్ ఎంపిక అవడం ఏ ఆటగాడికైనా అద్బుతమైన విజయం. ఎందుకంటే టీ20 క్రికెట్ చాలా హోరాహోరీగా సాగుతుంది. పొట్టి ఫార్మాట్‌లో సూర్య చాలా గొప్పగా రాణించాడు. అతడి గత రెండేళ్ల ప్రదర్శనను గమనిస్తే సూర్య ఆ సూర్యుడిలా నిరంతరం ప్రకాశిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ అధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం నిజంగా సంచలనమే. అతడు ఇప్పటివరకు చాలా తక్కువ వన్డేలు ఆడాడు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే కచ్చితంగా ప్రతి ఫార్మాట్‌లోనూ తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు. అన్నిఫార్మాట్లలోనూ రాణించగల సామర్థ్యం అతడికి ఉంది’’ అని పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు