వచ్చే మ్యాచ్‌లో కోహ్లీ 250 సాధిస్తాడు: నెహ్రా

చెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిస్తే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడని మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. అదే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227...

Updated : 10 Feb 2021 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిస్తే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడని మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. అదే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. టాస్‌ ఎంతో కీలకమని, అయితే ఇంగ్లాండ్ ప్రదర్శనను తక్కువ చేయట్లేదని పేర్కొన్నాడు. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు (578) సాధించింది. కాగా, గత కొన్ని మ్యాచ్‌లుగా కోహ్లీ శతకం సాధించిలేదని వస్తున్న విమర్శలపై నెహ్రా మాట్లాడాడు.

‘‘మీరందరూ ఒకటి లేదా రెండు సెంచరీల గురించి మాట్లాడుతున్నారు. అయితే భారత్‌ టాస్‌ గెలిస్తే కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడు. విరాట్‌కు ఉన్న ప్రత్యేకత అదే. అశ్విన్ ఔటైనప్పుడు మ్యాచ్‌ ఓడిపోతున్నామనే విషయం అతడికి తెలుసు. కానీ ఆ తర్వాత అతడు ఎడాపెడా షాట్లేమి ఆడలేదు. చేస్తున్న పరుగులకు అతడు గౌరవం ఇస్తుంటాడు. అందుకే అతడు త్వరగా ఔటవ్వలేదు. అయితే కోహ్లీ ఔటైన బంతికి ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా వెనుదిరుగుతాడు. బంతి చాలా తక్కువ ఎత్తులో వచ్చింది’’ అని నెహ్రా పేర్కొన్నాడు.

‘‘ఉపఖండ పిచ్‌లో నాలుగు, అయిదు రోజుల్లో ఎలా ఆడాలని కోరుకుంటారో కోహ్లీ అలానే ఆడాడు. ఇతర ఆటగాళ్ల కంటే కోహ్లీ అందుకే భిన్నంగా నిలుస్తున్నాడు. ఇక్కడే కాదు, ఇంగ్లాండ్‌లో అతడు పరుగులు చేయలేని పరిస్థితుల్లోనూ ఎంతో డిఫెన్సివ్‌తో బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలిచాడు. అలా చేయడానికి ఎంతో ఫిట్‌నెస్‌ అవసరం’’ అని నెహ్రా తెలిపాడు. లీచ్ (4/76), అండర్సన్‌ (3/17) ధాటికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. కోహ్లీ (72) ఒంటరి పోరాటం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం భారత్×ఇంగ్లాండ్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి..

మళ్లీ మైదానంలో సచిన్‌

రెండో టెస్టులో అతడికే చోటు: గావస్కర్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని