ODI World Cup: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి అగర్ ఔట్.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆటగాడికి చోటు

వన్డే ప్రపంచకప్ జట్టులో ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. కొన్ని రోజులగా పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అస్టన్ అగర్‌ (Ashton Agar)ను జట్టు నుంచి తప్పించింది. 

Published : 28 Sep 2023 19:46 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ జట్టులో ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. కొన్ని రోజులగా పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అస్టన్ అగర్‌ (Ashton Agar)ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మిడిల్‌ ఓవర్లలో ఓపిగ్గా ఆడే సత్తా ఉన్న మార్నస్‌ లబుషేన్‌ (Marnus Labuschagne)ను తీసుకుంది. ప్రస్తుతం లబుషేన్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌ జరిగిన మూడు వన్డేల సిరీస్‌, అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించాడు.లబుషేన్‌ తన లెగ్‌స్పిన్‌తోనూ భాగస్వామ్యాలు విడగొట్టగల ఉపయుక్తమైన బౌలర్‌గానూ పేరు సంపాదించాడు.

ఇదిలా ఉండగా.. ఆసియా కప్‌ టైటిల్‌ను దక్కించుకోవడం, ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని భారత్‌ మంచి ఊపులో ఉంది. ప్రపంచకప్‌లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి విశ్వవిజేతగా నిలవాలనుకుంటోంది. అక్టోబర్‌ 8న ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ వరల్డ్ కప్‌ సమరాన్ని ఆరంభించనుంది. అంతకంటే ముందు సెప్టెంబర్ 30న ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. 

మార్పుల అనంతరం ఆసీస్ వన్డే ప్రపంచ కప్ జట్టు:

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కెరీ, కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్‌, మార్కస్‌ స్టాయినిస్, డేవిడ్ వార్నర్‌, ఆడమ్ జంపా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని