ఇంటర్వ్యూయర్‌గా మారిన యాష్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా తిరుగులేని పోరాటం చేస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆతిథ్య జట్టుకు దీటుగా బదులిస్తోంది. సీనియర్‌ బౌలర్లు గాయపడటంతో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచే అయినా అదరగొడుతున్నారు.....

Published : 19 Jan 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా తిరుగులేని పోరాటం చేస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆతిథ్య జట్టుకు దీటుగా బదులిస్తోంది. సీనియర్‌ బౌలర్లు గాయపడటంతో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచే అయినా అదరగొడుతున్నారు. ముఖ్యంగా అశ్విన్‌ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సుందర్‌ అర్ధశతకం చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అతడికి తోడుగా ఠాకూర్‌ సైతం అర్ధశతకంతో అలరించాడు. దాంతో శతక భాగస్వామ్యం నెలకొల్పిన యాష్‌ స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు.

సాధారణంగా ఆట ముగిశాక ఆటగాళ్లు మీడియాతో మాట్లాడుతుంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ అయితే ఎక్కువగా యుజువేంద్ర చాహల్‌ క్రికెటర్లతో మాట్లాడిస్తుంటాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిశాక అశ్విన్‌ మైక్‌ అందుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మనసులోని భావాలను బయటకు రప్పించాడు.

‘తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశావు. టెస్టు కెరీర్‌ ఆరంభంలోనే స్టీవ్‌స్మిత్‌ వికెట్‌ పడగొట్టావు. బ్యాటుతో అర్ధశతకం సాధించావు. టెస్టు క్రికెట్‌ సులభంగా ఉందనుకుంటా’ అని సుందర్‌ను యాష్ ప్రశ్నించాడు. భాగస్వామ్యం నెలకొల్పేటప్పుడు సుందర్‌, శార్దూల్‌ మనస్తత్వం ఎలా ఉందో అడిగాడు.

‘గొప్పగా అనిపించింది. ఆ సమయంలో సిక్సర్లు కొట్టాలన్న ఉద్దేశమేమీ లేదు. బంతిని చూసి షాట్లు బాదాను. బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది’ అని శార్దూల్‌‌ బదులిచ్చాడు. ‘టెస్టు క్రికెట్‌ కచ్చితంగా కఠినమైన ఫార్మాటే. నేను బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. కెరీర్‌లో శుభారంభం లభించడం అదృష్టం. దేవుడి దయ, కుటుంబం అండతోనే ఇది సాధ్యమైంది’ అని సుందర్‌ అన్నాడు.

ఇవీ చదవండి
ప్చ్‌.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్‌!
చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని