IND vs SL: శనక ‘రనౌట్’ అప్పీలు రోహిత్‌ వెనక్కి.. స్పందించిన అశ్విన్‌

శ్రీలంకతో తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs SL) టీమ్‌ఇండియా (Team India) ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక (Dasun Shanaka) సెంచరీ కొట్టాడు. కానీ భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) తీసుకొన్న నిర్ణయం ప్రశంసలు కురిపించింది.

Published : 15 Jan 2023 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ చివరి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకొన్న టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. అయితే ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకొన్న నిర్ణయం నెట్టింట్లో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. శ్రీలంక సారథి డాసున్ శనక శతకానికి చేరువగా ఉన్న సమయంలో ‘నాన్‌ స్ట్రైకర్‌ రనౌట్’ అప్పీలును రోహిత్ వెనక్కి తీసుకొన్నాడు. ఎందుకలా చేశాడో కూడా రోహిత్ అప్పుడే చెప్పాడు. తాజాగా ఇదే విషయంపై టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ కూడా స్పందించాడు.

‘‘శనక 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు షమీ రనౌట్ చేశాడు. అది నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌. దాంతో షమీ అప్పీలు చేశాడు. కానీ కెప్టెన్‌ రోహిత్ అప్పీలును వెనక్కి తీసుకొన్నాడు. దీంతో వెంటనే చాలామంది తమ ట్వీట్లకు పదునుపెట్టారు. ఇప్పుడు మ్యాచ్‌ పరిస్థితి అప్రస్తుతం. అయితే ఇక్కడ నేను చెప్పేదొక్కటే.. అలా ఔట్‌ చేయడం ఇప్పుడు చట్టబద్ధమైందే. ఒకవేళ ఎల్బీ, క్యాచ్‌ ఔట్‌ సమయంలో కెప్టెన్‌ నిర్ణయంతో చెక్‌ చేయాల్సిన అవసరం లేదు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో అమితాబ్‌ బచ్చన్‌లా కెప్టెన్‌తో అంపైర్ ‘మీరు కచ్చితంగా ఉన్నారా’ అని అడగరు. బౌలర్‌ అప్పీలు చేస్తే అది ఔట్‌ అయితే అంపైర్‌ దానిని ఔట్‌గా ప్రకటిస్తారు. లేకపోతే లేదు. ఒకవేళ ఫీల్డర్‌ అప్పీలు చేసినా అంపైర్ నిర్ణయం తీసుకోవాలి’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు