RAshwin: అశ్విన్‌.. ఘనంగా ముగించాడు!

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. రెండేళ్ల సైకిల్‌లో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు....

Published : 24 Jun 2021 14:11 IST

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు వీరుడు యాష్‌

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. రెండేళ్లలో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అశ్విన్‌ మొత్తం 14 మ్యాచులు ఆడాడు. 26 ఇన్నింగ్సుల్లో 549.4 ఓవర్లు విసిరాడు. అందులో 105 ఓవర్లు మెయిడిన్లే కావడం ప్రత్యేకం. 1444 పరుగులిచ్చిన యాష్‌ 20.33 సగటు, 2.62 ఎకానమీ, 46.4 స్ట్రైక్‌రేట్‌తో 71 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 7/145, ఒక మ్యాచులో 9/207 అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు. కివీస్‌తో ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులిచ్చి 2 వికెట్ల పడగొట్టాడు. ఛాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. అంతేకాకుండా ఒక సెంచరీతో అదరగొట్టాడు. 324 పరుగులు చేయడం విశేషం.

అశ్విన్‌ తర్వాతి స్థానంలో ఆసీస్‌ విధ్వంసకర పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ నిలిచాడు. అతడు 14 మ్యాచుల్లో 21.92 సగటుతో 70 వికెట్లు తీయడం గమనార్హం. స్టువర్ట్‌ బ్రాడ్‌ 17 మ్యాచుల్లో 20.08 సగటుతో 69, టిమ్‌ సౌథీ 11 మ్యాచుల్లో 20.82 సగటుతో 56, నేథన్‌ లైయన్‌ 14 మ్యాచుల్లో 31.37 సగటుతో 56 వికెట్లు తీసి టాప్‌-5లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని