Asia Cup 2023 : ఆసియా కప్‌ ఫైనల్‌ : భారత్‌ vs పాక్‌ పోరును మళ్లీ చూస్తామా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?

ఆసియా కప్‌ ఫైనల్‌ పోరులో భారత్‌తో తలపడే జట్టు ఏది..? పాకిస్థాన్‌(IND vs PAK)తో మరోసారి పోరును చూస్తామా.. ఆ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

Published : 13 Sep 2023 15:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆసియా కప్‌ (Asia Cup 2023) సమరం తుది దశకు చేరుకుంది. సూపర్‌ - 4లో టీమ్‌ఇండియా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇప్పటికే ఫైనల్‌ చేరుకుంది. మరి ఫైనల్‌ల్లో భారత్‌తో తలపడేది ఎవరు.. శ్రీలంకనా..? పాకిస్థానా..? మరోసారి చిరకాల ప్రత్యర్థుల(IND vs PAK) మధ్య ఫైనల్‌ పోరుకు అవకాశం ఉందా..? సమీకరణలు ఎలా ఉన్నాయంటే..

ఆడే అవకాశం రాదని.. మైదానానికి కిట్‌ కూడా తెచ్చుకోలేదు

  • సూపర్‌ - 4 దశలో ఒక్కో జట్టు.. మిగతా వాటితో మూడేసి మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్‌ 2లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరుకుంటాయి.
  • సూపర్‌ - 4 దశలో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించి.. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత శ్రీలంకతో పోరాడి గెలిచింది. దీంతో నాలుగు పాయింట్లు సాధించిన టీమ్‌ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. ఫైనల్‌ చేరింది.
  • ఇక శ్రీలంక, పాకిస్థాన్‌ రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో మ్యాచ్‌లో ఓడి.. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే పాకిస్థాన్‌.. భారత్‌పై భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్‌రన్‌రెట్‌పై ప్రభావం పడి.. మూడో స్థానంలో ఉంది.
  • సెప్టెంబర్‌ 14న పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ విజేత భారత్‌తో ఫైనల్‌లో తలపడనుంది.
  • ఒకవేశ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయితే.. పాక్‌ ఫైనల్‌ ఆశలకు ఎదురు దెబ్బే. ఎందుకంటే మ్యాచ్‌ రద్దై చెరో పాయింట్‌ లభిస్తే.. 3 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌తో శ్రీలంక రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకుంటుంది. మ్యాచ్‌ జరిగి తప్పక విజయం సాధిస్తేనే పాక్‌ ఫైనల్‌కు చేరుతుంది.
  • ఇక బంగ్లాదేశ్‌ ఇప్పటికే రెండింటిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెప్టెంబర్‌ 15న భారత్‌, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్‌ నామమాత్రమే. ఫైనల్‌కు ముందు సన్నద్ధతగా భారత్‌కు ఉపయోగపడనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని