Asia Cup 2023: ఆసియా కప్‌ షెడ్యూల్‌ ఖరారు... భారత్‌ X పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 

Updated : 19 Jul 2023 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే మినీ టోర్నీ కోసం పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు లెక్కన హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్ణయం తీసుకుంది.

Asia Cup 2023: ఆసియా కప్‌ 2023.. ప్రోమో చూశారా..?

గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా... గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌, శ్రీలంక ఆడనున్నాయి. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి. సూపర్‌ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. పాకిస్థాన్‌తో సెప్టెంబరు 2న, నేపాల్‌తో సెప్టెంబరు 4న భారత్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని