Asia Cup 2023: యూఏఈలో ఆసియాకప్‌!

ఆసియా కప్‌కు (Asia Cup 2023) యూఏఈ వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఏసీసీ ఛైర్మన్‌ జై షా (Jay shah), పీసీబీ అధ్యక్షుడు నజామ్‌ సేథీ (Nazam Sethi) టోర్నీని యూఏఈకి మార్చే విషయం గురించి చర్చించారు.

Updated : 05 Feb 2023 10:56 IST

దిల్లీ: ఆసియా కప్‌కు (Asia Cup 2023) యూఏఈ వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఏసీసీ ఛైర్మన్‌ జై షా (Jay Shah), పీసీబీ అధ్యక్షుడు నజామ్‌ సేథీ (Nazam Sethi) టోర్నీని యూఏఈకి (UAE) మార్చే విషయం గురించి చర్చించారు. వేదికను మార్చిలో ఖరారు చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీలో ఆడేందుకు పాక్‌కు వెళ్లమని నిరుడు అక్టోబర్‌లో బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్‌ ఆడకుంటే.. టోర్నీ నిర్వహించినా పాకిస్థాన్‌కు ఎలాంటి ఆదాయం లభించకపోచ్చు. భారత్‌ (Team India) సహా అన్ని దేశాలతో తటస్థ వేదికలో టోర్నీ నిర్వహించినా ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి గ్రాంటు లభిస్తుంది. ప్రస్తుతం తమ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో యూఏఈలో టోర్నీని నిర్వహించడం ద్వారా ప్రసార హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందొచ్చని పాక్‌ బోర్డు యోచిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు