Asia Cup: ఆసియా కప్‌ రద్దు!

జూన్‌లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దు అయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం.....

Published : 19 May 2021 21:10 IST

కొలంబో: జూన్‌లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దు అయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీప్ ఎగ్జిక్యూటివ్‌ యాష్లే డిసిల్వా ప్రకటించారు. రానున్న రెండేళ్లకు చాలా దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూల్స్ సిద్ధం చేసుకున్నందున.. 2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత దీన్ని నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలోని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్‌ అతిథ్యమివ్వాల్సింది. కానీ, భారత్- పాక్‌ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత ఆటగాళ్లు అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో దీనిని శ్రీలంకకు మార్చారు. మరోవైపు, శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10 రోజులపాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని