Asia Cup 2023: ఆసియా కప్‌ 2023.. తెలుగు కుర్రాడికి చోటు.. భారత జట్టు ఇదే!

ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం భారత జట్టును బీసీసీఐ వెల్లడించింది. రిజర్వ్‌తో కలిపి మొత్తం 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.

Updated : 21 Aug 2023 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. గాయాల నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌లకు చోటు దక్కింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు జట్టులో స్థానం కల్పించారు. చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పాల్గొన్నారు. రోహిత్ నాయకత్వంలో 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐర్లాండ్‌ పర్యటనకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రాతోపాటు మరో పేసర్‌ ప్రసిధ్‌ కూడా జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్‌లో రోహిత్‌కు డిప్యూటీగా హార్దిక్‌ పాండ్య వ్యవహరిస్తాడు. ప్రపంచకప్‌ కోసం జట్టును సెప్టెంబర్ 4న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

షెడ్యూల్‌ ఇదే..

పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగనున్నాయి. సూపర్‌ -4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6 నుంచి మొదలుకాన్నాయి. ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు