Asian Games 2022: ఆసియా క్రీడలు.. చైనా చేతిలో భారత్ ఘోర పరాజయం
ఆసియా క్రీడలను భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఘోర పరాజయంతో ఆరంభించింది. మంగళవారం ఆతిథ్య చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-5 తేడాతో ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలను భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఘోర పరాజయంతో ఆరంభించింది. మంగళవారం ఆతిథ్య చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-5 తేడాతో ఓటమిపాలైంది. ప్రయాణం చేసి అలసిపోవడం, సరైన సన్నద్ధతలేమి, వేడి వాతావరణం కారణంగా భారత ఆటగాళ్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. భారత్ తరఫున రాహుల్ కేపీ (45+1) నిమిషంలో గోల్ చేయడంతో ఆట మొదటి అర్ధ భాగం 1-1తో ముగిసింది. రెండో అర్ధ భాగంలో చైనా ఆటగాళ్లు ఏకంగా నాలుగు గోల్స్ చేశారు. ఆతిథ్య జట్టు తరఫున గియావో తియానీ (17 నిమిషం), డై వీజున్ (51 నిమిషం), టావో కియాంగ్‌లాంగ్ (72, 75 నిమిషం), హావో ఫాంగ్ (90+1 నిమిషం)లో గోల్స్ చేశారు.భారత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, మయన్మార్‌లను ఓడించాలి.
15 పరుగులకే ఆలౌట్
ఆసియా క్రీడల్లో భాగంగా మహిళల క్రికెట్‌లో ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 15 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండోనేసియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇందులో 49 ఎక్స్‌ట్రాలున్నాయి. వాటిలో 38 వైడ్లు ఉండటం గమనార్హం. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా 10 ఓవర్లు ఆడి 15 పరుగులకే ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
DGCA: పైలట్లు పెర్ఫ్యూమ్లు వాడొద్దు.. డీజీసీఏ ముసాయిదా!
-
EU Meet: ఈయూ విదేశాంగ మంత్రుల భేటీ.. ఉక్రెయిన్ వేదికగా ఇదే తొలిసారి!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు