WPL: ధోనీ, కోహ్లీ.. ఎవరిని ఎంచుకుంటారు..? అదిరిపోయే సమాధానమిచ్చిన ఆర్సీబీ బ్యాటర్
ధోనీ(MS Dhoni), కోహ్లీ(Virat Kohli)లను విపరీతంగా అభిమానించే వారికి.. వారిలో ఒకరిని ఎంచుకోమంటే ఎంత కష్టమో..! ఇప్పుడా పరిస్థితి ఆర్సీబీ బ్యాటర్‌కు ఎదురైంది. అయితే ఆమె ఎంతో తెలివిగా సమాధానమిచ్చి ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli).. వీరిద్దరూ భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన ఆటగాళ్లే. తమ ఆటతో టీమ్‌ఇండియా(Team India)ను మరోస్థాయికి తీసుకెళ్లారు. వీరికి అంతర్జాతీయంగానూ అభిమానులు ఉన్నారు. యువ క్రికెటర్లు వీరి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. అందులో ప్రస్తుతం డబ్ల్యూపీఎల్(WPL)లో ఆర్సీబీ(RCB)కి ఆడుతున్న ఆసీస్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పేర్రీ(Ellyse Perry) ఒకరు.
ఆర్సీబీ Q&A సెషన్‌లో భాగంగా ఈమెకు కోహ్లీ, ధోనీల గురించి ఓ క్లిష్లమైన ప్రశ్న ఎదురైంది. అయితే.. దానికి ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ప్రశ్న : కోహ్లీ, ధోనీలలో ఎవరిని మీరు ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా ఎంచుకుంటారు..?
పెర్రీ : ఇద్దర్నీ ఎంచుకుంటాను. ఎందుకంటే వాళ్లిద్దరూ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేస్తుంటే.. నేను ప్రేక్షకుల మధ్యలో కూర్చొని వారి ఆటను తిలకిస్తాను.
ఈ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ పంచుకుంది. ఇక WPL తొలి సీజన్‌లో ఆర్సీబీ అనుకున్నమేర రాణించలేకపోతోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది స్మృతి మంధాన సేన. ఇక పెర్రీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 31, 13 పరుగులు చేయగా.. బంతితో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయింది. బుధవారం ఈ జట్టు గుజరాత్‌ను ఎదుర్కోనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు.. పరీక్ష తేదీలివే!
-
Politics News
Andhra News: మంత్రి పదవి ఉన్నా.. లేకపోయినా బాధపడను: మంత్రి అప్పలరాజు
-
Sports News
Hardik Pandya: ఆ కల తీరిపోయింది.. ఇక అదే మా లక్ష్యం: హార్దిక్ పాండ్య
-
Politics News
Amaravati: బరి తెగించిన వైకాపా శ్రేణులు.. అమరావతిలో భాజపా నేతలపై దాడి
-
India News
Modi: మోదీ ‘డిగ్రీ’ని చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా
-
India News
Delhi: కొవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: సీఎం కేజ్రీవాల్