Lovlina's Olympics semifinal: లవ్లీనా మ్యాచ్‌ కోసం అసెంబ్లీ సమావేశాలు 30 నిమిషాలు వాయిదా..!

టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో దూసుకుపోతున్న లవ్లీనా బొర్గొహైన్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను అస్సాం ప్రభుత్వం 30 నిమిషాలపాటు వాయిదా వేసే అవకాశం ఉంది. లవ్లీనా బుధవారం టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సుర్మెనెలితో తలపడనుంది. ఈ

Updated : 04 Aug 2021 05:29 IST

గువాహటి: టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో దూసుకుపోతున్న లవ్లీనా బొర్గొహైన్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను అస్సాం ప్రభుత్వం 30 నిమిషాలపాటు వాయిదా వేసే అవకాశం ఉంది. లవ్లీనా బుధవారం టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సుర్మెనెలితో తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలను ఉదయం 11 గంటల నుంచి 30 నిమిషాలపాటు వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదనలు పంపినట్టు డిప్యూటీ స్పీకర్‌ డాక్టర్‌ నుముల్‌ మొమిన్‌ సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌ విభాగంలో బరిలో దిగిన భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌.. 69 కిలోల విభాగంలో సత్తా చాటింది. క్వార్టర్స్ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. బుధవారం జరగబోయే కీలక మ్యాచ్‌లో గెలిస్తే ఆమె ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడినా ఆమెకు కాంస్యం దక్కుతుంది. లవ్లీనా కంటే ముందు విజేందర్‌ సింగ్‌, మేరీ కోమ్‌లు మాత్రమే బాక్సింగ్‌లో భారత్‌కు పతకాలు సాధించిపెట్టారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని