Published : 20/01/2021 20:20 IST

ర్యాంకింగ్స్‌లో పంత్ నయా రికార్డు 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌×ఆస్ట్రేలియా సిరీస్‌ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. గబ్బా టెస్టు హీరో రిషభ్‌ పంత్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. 691 పాయింట్లతో 13వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఈ ర్యాంకింగ్స్‌లో పంత్ ఓ ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ ప్రస్తుత వికెట్‌కీపర్లలో అతడే టాప్‌లో ఉన్నాడు. పంత్‌ తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ ఉన్నాడు. డికాక్ 677 పాయింట్లతో 15వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

కాగా, నాలుగో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గిల్‌ 68వ ర్యాంక్‌ నుంచి 47వ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొని అర్ధశతకం సాధించిన పుజారా ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో నిలిచాడు. అజింక్య రహానె ఏడో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇక పితృత్వ సెలవులపై జట్టుకు దూరమైన కోహ్లీ (862) ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్‌ (919), స్టీవ్‌ స్మిత్‌ (891), లబుషేన్ (878) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి అశ్విన్‌, బుమ్రా టాప్‌-10లో ఉన్నారు. ఇద్దరు వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఆసీస్ పేసర్‌ ప్యాట్ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లతో సత్తాచాటిన సిరాజ్ ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్‌, వెస్టిండీస్‌ క్రికెటర్ జేసన్ హోల్డర్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చదవండి

మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!

భారత్‌-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్‌

ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని