KL Rahul - Athiya: వాంఖడే వన్డే హీరో కేఎల్ రాహుల్‌కి... అతియా ప్రత్యేక సందేశం
శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ అర్ధశతకం సాధించి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి భార్య అతియా శెట్టి ప్రత్యేక మెసేజ్ పంపింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) భారీ స్కోర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆయన జీవిత భాగస్వామి అతియా శెట్టి (Athiya Shetty) ఇన్‌స్టా వేదికగా రాహుల్‌కు ప్రత్యేకమైన సందేశం పంపింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కేఎల్, జడేజా ఫొటోను ఆమె పంచుకుంది. ‘‘నాకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తి కేఎల్ రాహుల్’’ అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో కేఎల్ రాహుల్ (KL Rahul) తన ప్రియురాలు, నటి అతియా శెట్టి (Athiya Shetty) మెడలో మూడు ముళ్లు వేసిన విషయం తెలిసిందే.
ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఆటతీరుపై హార్దిక్ పాండ్య సైతం ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ రోజు మా ఆట చూసి గర్వపడుతున్నా. ఎనిమిది నెలలుగా వన్డేలకు దూరంగా ఉన్న జడేజా అద్భుతంగా రాణించాడు. నా బౌలింగ్, బ్యాటింగ్‌ని నేను ఎంజాయ్ చేశాను. కేఎల్, జడ్డూ బ్యాటింగ్ చేసిన విధానం.. విమర్శకుల నోరు మూయించింది’’ అని పాండ్య పేర్కొన్నాడు.
కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా భారీ స్కోరు సాధించట్లేదు. దీంతో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు, నాలుగు టెస్టుల్లో స్థానం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అయినప్పటికీ తనపై వచ్చిన విమర్శలన్నిటికీ బ్యాట్‌తో సమాధానం చెబుతూ 91 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కష్టకాలంలో జడేజా సహకారంతో భారత్‌కు అండగా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?