T20 World Cup: పాక్‌పై ఆసీస్‌ ఇలా గెలిచింది!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు

Updated : 12 Nov 2021 14:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176  పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలినా.. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (49) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. చివర్లో వచ్చిన మార్కస్ స్టాయినిస్ (40), మాథ్యూ వేడ్ (41) కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆస్ట్రేలియా ఇంకా ఒక ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించేసింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోను మీరు చూసేయండి.

వీడియో కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని