Ashes Test Series: యాషెస్‌ టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ జట్టిదే..

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో యాషెస్ టెస్ట్‌ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిసెంబరు 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య కాలంలో మొత్తం ఐదు టెస్టులు..

Published : 17 Nov 2021 11:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో యాషెస్ టెస్ట్‌ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబరు 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య కాలంలో మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో తొలి రెండు టెస్టులకు సంబంధించిన తుదిజట్టును ఆస్ట్రేలియా జట్టు యాజయాన్యం బుధవారం వెల్లడించింది. టిమ్‌ పైన్‌ కెప్టెన్‌గా మొత్తం 15 మందితో కూడిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది.

యాషెస్ సిరీస్‌కు ఆసీస్ జట్టిదే..

టిమ్‌ పైన్‌ (కెప్టెన్‌), పాట్‌ కమ్మిన్స్ (వైస్‌ కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్‌, మార్కస్‌ హ్యారిస్, జోష్‌ హేజిల్ వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లైయన్‌, మైఖేల్‌ నేసర్‌, జై రిచర్డ్‌సన్, స్టీవ్‌ స్మిత్, మిచెల్ స్టార్క్‌, మిచెల్ స్వెప్సన్, డేవిడ్‌ వార్నర్ 

యాషెస్‌ టెస్ట్ సిరీస్‌ జరుగనున్న వేదికలివే..

తొలి టెస్ట్‌: డిసెంబరు 8-12 - గబ్బా, బ్రిస్బేన్‌

రెండో టెస్ట్‌: డిసెంబరు 16-20 - ఆడిలైడ్‌ ఓవల్‌

మూడో టెస్ట్: డిసెంబరు 26-30 - మెల్ బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌

నాలుగో టెస్ట్: జనవరి 5-9 - సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌

ఐదో టెస్ట్‌: జనవరి 14-18 - పెర్త్ స్టేడియం

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని