T20 World Cup: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై ఆసీస్ విజయం
టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో 121 పరుగులు చేసిన గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (35) రాణించగా.. డేవిడ్ వార్నర్ 14, మ్యాక్స్‌వెల్ 18, మార్ష్ 11 పరుగులు చేశారు. ఆరోన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 38 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన ఆసీస్‌ను స్మిత్-మ్యాక్స్‌వెల్ భాగస్వామ్యం ఆదుకుంది. వీరిద్దరూ కలిసి 42 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో స్మిత్‌తోపాటు మ్యాక్సీ ఔట్ కావడంతో ఆసీస్ శిబిరంలో కాస్త కలవరం రేగింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టం చేసినా మార్కస్ స్టొయినిస్ (24*), మ్యాథ్యూ వేడ్ (15*) ఏమాత్రం పట్టు విడవకుండా ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో నార్జే 2.. రబాడ, మహరాజ్, షంసి తలో వికెట్ తీశారు.
రాణించిన మారక్రమ్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచారు. అయితే మారక్రమ్ (40) రాణించడం.. రబాడ (19*) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 118 పరుగులు చేయగలిగింది. బవుమా 12, డికాక్ 7, డస్సెన్ 2, క్లాసెన్ 13, మిల్లర్ 16, ప్రిటోరియస్ 1, నార్జే 2 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హేజిల్‌వుడ్ 2, జంపా 2.. మ్యాక్స్‌వెల్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్‌నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్‌కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్‌కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.