IND vs AUS: జడేజా గైర్హాజరీలో భారత్ బలహీనపడిందని భావించారు.. కానీ: ఆసీస్ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌

మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌లతోపాటు...

Updated : 26 Sep 2022 21:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌లతోపాటు టీ20 ప్రపంచకప్‌ జట్టుకూ దూరమైన విషయం తెలిసిందే. దీంతో రవీంద్ర జడేజా గైర్హాజరీలో టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బలహీనంగా మారిందనే అంచనాలను కొట్టిపడేస్తూ.. ఆసీస్‌పై భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇందులో అక్షర్‌ పటేల్ కీలక పాత్ర పోషించాడు. దీంతో రవీంద్ర జడేజాకు సరైన ప్రత్యామ్నాయంగా మారాడని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసించాడు. 

‘‘ఈ సిరీస్‌ అక్షర్‌ పటేల్‌కు ప్రత్యేకం. ఎందుకంటే జడేజా సిరీస్‌కు దూరమైనప్పుడు ప్రతి ఒక్కరూ భారత్‌ కాస్త బలహీనపడిందని భావించారు. అయితే టీమ్‌ఇండియాకు మరో అద్భుత ఆటగాడు దొరికాడు’’ అని మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసీస్‌ కోచ్ వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ప్రమాదకర బ్యాటర్‌ అవుతాడని మెక్‌డొనాల్డ్‌  అంచనా వేశాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో సూర్యకుమార్‌ (69) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకొన్నాడు. మరోవైపు మూడు మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు తీసిన అక్షర్‌ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. 


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts