వాళ్లను గుర్తించలేకపోయాం: క్రికెట్ ఆస్ట్రేలియా‌

సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెటర్లపై జాతి వివక్ష దూషణలకు దిగిన ప్రేక్షకులను గుర్తించలేకపోయామని క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఐసీసీతో చెప్పింది. స్టాండ్స్‌ నుంచి గెంటివేసిన...

Updated : 27 Jan 2021 11:29 IST

సిడ్నీ: సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెటర్లపై జాతి వివక్ష దూషణలకు దిగిన ప్రేక్షకులను గుర్తించలేకపోయామని క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఐసీసీతో చెప్పింది. స్టాండ్స్‌ నుంచి గెంటివేసిన ఆరుగురు ప్రేక్షకులు అసలు దోషులు కాదని విచారణలో తేలిందని తెలిపింది. ఈ మేరకు ఐసీసీకి సీఏ నివేదికను సమర్పించింది. ‘‘భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు నిజమే అని నమ్ముతున్నాం. కానీ దర్యాప్తు అధికారులు దోషులను గుర్తించలేకపోయారు’’ అని నివేదికలో సీఏ పేర్కొన్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. అంతకుమందు తన ఓవర్లో రెండు సిక్స్‌లు పోయినందుకు కలత చెందిన సిరాజ్‌.. ప్రేక్షకుల్లో ఒకరు ‘‘వెల్కమ్‌ టు సిడ్నీ, సిరాజ్‌’’ అన్నందుకు అంపైర్‌ వద్దకు వెళ్లినట్లు గెంటివేతకు గురైన  ఓ ప్రేక్షకుడు చెప్పాడని ఓ పత్రిక తెలిపింది.

ఇదీ చదవండి

రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని