Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ హఠాన్మరణం
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్(52) కన్నుమూశాడు. శుక్రవారం గుండెపోటుకు గురవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్(52) (Shane Warne) కన్నుమూశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న వార్న్ తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ప్రాథమికంగా వైద్యులు పేర్కొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాకు షేన్‌వార్న్ విశేష సేవలందించారు. 1992లో జాతీయ జట్టుకు ఎంపికైన వార్న్ ఆసీస్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. దాదాపు 15 ఏళ్లపాటు సేవలందించిన వార్న్ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఆసీస్ తరపున మొత్తం 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశారు. 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో 37సార్లు 5 వికెట్లు తీయగా, 10 సార్లు 10 వికెట్లు తీసిన ఆటగాడిగా షేన్ వార్న్ రికార్డు సృష్టించారు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వార్న్ కంటే ముత్తయ్య మురళీధరన్ (800) ముందున్నాడు. సచిన్-వార్న్, లారా-వార్న్ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది. వార్న్ మృతి పట్ల పలువురు క్రికెటర్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలు పెట్టారు.
తొలి ఐపీఎల్లో విజేతగా నిలిపి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఎడిషన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఘనత షేన్ వార్న్‌దే. కెప్టెన్, మెంటార్‌గా ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి మరీ ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు పగ్గాలను చేపట్టడం విశేషం. ఇటు సీనియర్లు, యువ ఆటగాళ్లను సమతూకం చేసుకుంటూ రాజస్థాన్‌కు టైటిల్‌ను సాధించి పెట్టాడు. 2011 వరకు రాజస్థాన్‌కు సారథిగా వ్యవహరించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: నాగ్‌పుర్ పిచ్ ఏం చెబుతోంది?
-
Politics News
PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ
-
Movies News
Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
-
Sports News
IND vs AUS: రవీంద్రజాలంలో ఆసీస్ విలవిల.. 200లోపే ఆలౌట్
-
World News
Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్..?
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్