Cricket News: ఆసీస్‌ దిగ్గజ వికెట్‌ కీపర్‌ కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన క్రికెటర్లు

ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ (74) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గతవారం ఆయన క్వీన్స్‌లాండ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనగా గుండెపోటుకు గురయ్యారు...

Updated : 04 Mar 2022 14:55 IST

 (Photo: ICC Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ (74) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గతవారం ఆయన క్వీన్స్‌లాండ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనగా గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి అడిలైడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఐసీసీ ఈ విషయాన్ని తెలియజేసి సంతాపం ప్రకటించింది. మార్ష్‌ మృతి పట్ల పలువురు ఆసీస్‌ మాజీలు సైతం విచారం వ్యక్తం చేశారు. ఆయనో దిగ్గజ వికెట్‌ కీపర్‌ అని, తన ఆటతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాడని కొనియాడారు.

రాడ్‌ మార్ష్‌ ఆస్ట్రేలియా తరఫున 1970-80వ దశకంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా సేవలందించారు. మొత్తం 96 టెస్టులు, 92 వన్డేలు ఆడిన ఆయన కీపర్‌గా అప్పట్లోనే 355 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అలాగే ఆస్ట్రేలియా తరఫున తొలి శతకం బాదిన వికెట్‌ కీపర్‌గానూ మరో రికార్డు సృష్టించారు. 1984లో రిటైరైన మార్ష్‌ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ అకాడమీలో రికీపాంటింగ్‌, బ్రెట్‌లీ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. తర్వాతి కాలంలో ఇంగ్లాండ్‌ టీమ్‌ సెలెక్టర్‌గా, ఆస్ట్రేలియా చీఫ్‌ సెలెక్టర్‌గా సేవలందించారు. ఇక 2009లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోనూ స్థానం దక్కించుకున్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు