Side Shows: భారత్‌కు తెలియని పని

టీమ్‌ఇండియా పక్కదారి పట్టించి తమను ఓడించిందన్న టిమ్‌పైన్‌ వ్యాఖ్యలు విస్మయం కలిగించాయని మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా అన్నారు....

Published : 14 May 2021 10:38 IST

టిమ్‌పైన్‌ మాట ఎవరు వింటారన్న దీప్‌దాస్‌ గుప్తా

ముంబయి: టీమ్‌ఇండియా పక్కదారి పట్టించి తమను ఓడించిందన్న టిమ్‌పైన్‌ వ్యాఖ్యలు విస్మయం కలిగించాయని మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా అన్నారు. భారత జట్టు క్వారంటైన్‌ ఇబ్బందులు పడటం వాస్తవమేనని పేర్కొన్నారు. 1-2 తేడాతో సిరీస్‌ ఓడిపోవడం ఆసీస్‌ స్వయం కృతమేనని వెల్లడించారు.

‘ఓటమి పాలైన కొన్ని నెలల తర్వాత టిమ్‌పైన్‌ ఈ విషయంపై మాట్లాడాడు. టీమ్‌ఇండియా పక్కదారి పట్టించిందనడం విస్మయం కలిగించింది. నిజానికి బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే కదా. క్వారంటైన్‌ అంశంలో నిజాయితీ ఉంది. టీమ్‌ఇండియా ఉద్దేశ పూర్వకంగా ఏమీ చేయలేదు. గబ్బా టెస్టుకు ముందు జట్టును ఐసోలేషన్‌లో ఉండమన్నారు. ఆటగాళ్లు, కోచ్‌ల్లో ఎవ్వరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. చాలాసార్లు వదంతులు రావడం చూస్తూనే ఉంటాం’ అని దీప్‌దాస్‌ అన్నారు.

‘అసలు అధికారిక ప్రకటనే లేనప్పుడు ఆసీస్‌ దేని గురించి మాట్లాడుతున్నట్టు? వారి మాట ఎవరు వింటున్నట్టు? నిజానికి వాళ్ల ఓటమి స్వయంకృతం. 30 ఏళ్ల తర్వాత గబ్బాలో ఓడిపోయారు. టీమ్‌ఇండియా చేతిలో వరుస సిరీసులు కోల్పోయారు. బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే. భారత్‌ ఎలాంటి మైండ్‌గేమ్స్‌ ఆడలేదు. టీమ్‌ఇండియా మైండ్‌గేమ్స్‌ ఆడటం, పక్కదారి పట్టించడం నేనెప్పుడూ చూడలేదు. ఇన్నాళ్ల తర్వాత వారు ఓటమిపై మాట్లాడటం ఆశ్చర్యకరమే’ అని దీప్‌దాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని