Australia Open: మహిళల డబుల్స్‌ కైవసం చేసుకున్న క్రెజికోవా, సైనికోవా

ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణులు బార్బోవా క్రెజికోవా, కతెరినా సైనికోవా విజయం సాధించారు...

Updated : 30 Jan 2022 14:11 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణులు బార్బోవా క్రెజికోవా, కతెరినా సైనికోవా విజయం సాధించారు. కజికిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినా, బ్రెజిల్‌ క్రీడాకారిణి బియాట్రిజ్‌ హద్దద్‌ మాయాపై 6-7 (3), 6-4, 6-4 తేడాతో గెలుపొందారు. కాగా, ఈ విజయం వారిద్దరికీ నాలుగో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. 2018, 2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించిన ఈ చెక్‌ రిపబ్లికన్‌ క్రీడాకారిణులు 2018లో వింబుల్డన్‌ విజేతలుగా సైతం నిలిచారు. ఈ క్రమంలోనే ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజయం సాధించి కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌ స్లామ్‌ అందుకున్నారు. 2 గంటల 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థులు వీరికి గట్టి పోటీనిచ్చారు. అయినా, పట్టుదలగా ఆడి చివరికి విజేతలుగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని