వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔట్‌..ఆధిక్యం 133

బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయింది. 26వ ఓవర్‌లో ఓపెనర్‌ హ్యారిస్‌ (38)ను శార్దూల్ ఔట్ చేశాడు. బంతిని అంచనా..

Updated : 18 Jan 2021 06:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయింది. 26వ ఓవర్‌లో ఓపెనర్‌ హ్యారిస్‌ (38)ను శార్దూల్ ఔట్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన హ్యారిస్‌ వికెట్‌కీపర్‌ పంత్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్‌ వేసిన సుందర్‌.. అర్ధశతకానికి చేరువవుతున్న డేవిడ్ వార్నర్‌ (48)ను బోల్తాకొట్టించాడు. చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వార్నర్‌ సమీక్షకు వెళ్లినా ఔట్ అనే తేలింది. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్‌ ఓపెనర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.  దాదాపు 20 ఓవర్లు వికెట్‌ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. క్రీజులో లబుషేన్‌ (6), స్మిత్ (3) ఉన్నారు. ఆసీస్‌ 133 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చదవండి

గబ్బాలో కొత్త హీరోలు

కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని