Wimbledon: మహిళల సింగిల్స్‌ విజేత ఆష్లే బార్టీ

వింబుల్డన్‌ 2021లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆష్లే బార్టీ మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. తుదిపోరులో ఆమె చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో విజయం సాధించి..

Updated : 10 Jul 2021 21:27 IST

(Photo: Wimbledon Twitter)

లండన్‌: వింబుల్డన్‌ 2021లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆష్లే బార్టీ మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. తుదిపోరులో ఆమె చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు టైటిల్‌ సాధించింది. ఈ క్రమంలోనే బార్టీ తన కెరీర్‌లో రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలిసెట్‌లో అలవోకగా గెలిచిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ రెండో సెట్‌లో కాస్త తడబడిపోయింది. దాంతో ప్లిస్కోవా పైచేయి సాధించి మ్యాచ్‌ను ఉత్కంఠస్థితికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే మూడోసెట్‌ అనివార్యమవ్వగా ఈసారి బార్టీ ఆధిపత్యం చెలాయించింది. చివరికి తన కలను నిజం చేస్తూ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాలని కలగన్న ప్లిస్కోవాకు భంగపాటు తప్పలేదు. ఇక వింబుల్డన్‌ బాలుర విభాగంలో ఇండో-అమెరికన్‌ సమీర్‌ బెనర్జీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడు సెమీస్‌లో గీమార్ట్ వేయన్‌బర్గ్‌పై విజయం సాధించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని