Sachin Or Kohli: సచిన్, కోహ్లీ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటావు? కమిన్స్ సమాధానమిదే
సచిన్, విరాట్ కోహ్లీలలో ఎవరు గొప్ప అనే ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమానికి ఒక్కసారైనా మెదిలే ఉంటుంది. ఇదే ప్రశ్నను ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా.. పాట్ కమిన్స్ (Pat Cummins)ని అడిగాడు. అతడు ఏమని సమాధానం ఇచ్చాడంటే..
ఇంటర్నెట్ డెస్క్: సచిన్ తెందూల్కర్ లేదా విరాట్ కోహ్లీ? వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమానికి ఒక్కసారైనా మెదిలే ఉంటుంది. సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)ని అభిమానులు 'గాడ్ ఆఫ్ క్రికెట్' అని పిలుస్తుండగా. విరాట్ కోహ్లీ ( Virat Kohli)ని ‘రన్ మెషీన్’ అని సంబోధిస్తుంటారు. సచిన్ నెలకొల్పిన రికార్డుల్లో కొన్నింటిని కోహ్లీ ఇప్పటికే బద్ధలు కొట్టగా.. మరికొన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా సాగుతున్నాడు. వన్డేల్లో కోహ్లీ మరో నాలుగు సెంచరీలు చేస్తే సచిన్ (49) పేరిట ఉన్న రికార్డును అధిగమించి ఈ ఫార్మాట్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు. అయితే, వీరిద్దరూ గొప్ప ఆటగాళ్లే. సచిన్ ఆడినప్పటి పరిస్థితులతో పోలిస్తే కోహ్లీ కాలంలో అనేక మార్పులు వచ్చాయి.
సచిన్ లేదా కోహ్లీ.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోని అమోజన్ ప్రైమ్ వీడియోస్ రూపొందించిన ‘ది టెస్టు’ రెండో సీజన్ టీజర్లో ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తమ టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌ని అడిగాడు. ‘మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి సచిన్‌తో చాలా ఏళ్ల క్రితం ఒకే ఒక్క టీ20 ఆడాను. కాబట్టి నేను విరాట్ అని చెబుతా’ కమిన్స్ బదులిచ్చాడు. తర్వాత ఖవాజాకు కమిన్స్ రెండు ప్రశ్నలు వేశాడు. భారత్ బ్యాటింగ్ లైనప్‌లో ఫేమస్ అయిన నలుగురు ఆటగాళ్లకు ర్యాంకింగ్ ఇవ్వండి అని అడగ్గా.. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ అని సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా జెర్సీలో చూడాలనుకుంటున్న ఇద్దరు భారత ఆటగాళ్ల పేర్లు చెప్పు అని అడగ్గా.. ‘విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్’ అని జవాబిచ్చాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?