Shane Warne: రోడ్డు ప్రమాదంలో షేన్‌వార్న్‌కు గాయాలు..!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకొంది.  సోమవారం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన పాదం విరిగినట్లు భావిస్తున్నారు. వార్న్‌

Updated : 29 Nov 2021 14:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌  షేన్‌వార్న్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.  సోమవారం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన పాదానికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. వార్న్‌ , ఆయన కుమారుడు జాక్సన్‌ కలిసి దాదాపు 300 కిలోల బరువున్న బైకుపై మెల్‌బోర్న్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. తొలుత ఎటువంటి గాయం కాలేదని భావించిన వార్న్‌ ఆసుపత్రికి వెళ్లలేదు. కానీ, సోమవారం ఉదయం నిద్రలేచే సమయానికి  గాయం తీవ్రమై భరించలేని నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ‘‘నాకు గాయమైంది.. నొప్పి తీవ్రంగా ఉంది’’ అని ఆస్ట్రేలియన్‌ మీడియా వద్ద వార్న్‌ పేర్కొన్నారు.

డిసెంబర్‌ 8 నుంచి బ్రిస్బేన్‌లో మొదలయ్యే యాషెస్‌ సిరీస్‌లో వార్న్‌ కామెంటరీ చెప్పాల్సి ఉంది. అప్పటికల్లా కోలుకోవచ్చని భావిస్తున్నారు.  తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడటంతో  క్రికెట్‌ ఆస్ట్రేలియా, వేల్స్‌ క్రికెట్‌ బోర్డులు యాషెస్‌ నిర్వహణపై ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. ‘‘మేము ఇప్పుడే ఆస్ట్రేలియాతో చర్చలు మొదలుపెట్టాం. సరిహద్దు మూసివేత నిర్ణయాలు ఉండవచ్చు. మా కుటుంబాలు ప్రయాణించేందుకు మాత్రం అనుమతించవచ్చు. ఆ నిర్ణయాలు మాపై ప్రభావం చూపవని భావిస్తున్నాం. కానీ, మొత్తం జాతీయ, స్థానిక ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది’’ అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ యాష్‌లీ గిలెస్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని