Virat Kohli చికాకు తెప్పిచ్చి విసిగిస్తాడు 

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని, అతడి ఆటతో ప్రత్యర్థులకు చికాకు తెప్పిచ్చి విసిగిస్తాడని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు...

Published : 16 May 2021 22:44 IST

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని, అతడి ఆటతో ప్రత్యర్థులకు చికాకు తెప్పిచ్చి విసిగిస్తాడని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. తాజాగా అతడు ‘గిల్లీ అండ్‌ గాస్‌’ అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2018-19 సీజన్‌లో కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ గెలిచింది. ఈ సందర్భంగా పైన్‌ నాటి విశేషాలను గుర్తుచేసుకొని ఈ విధంగా వ్యాఖ్యానించాడు.

‘నేను విరాట్‌ కోహ్లీకి ఈ విషయం చాలా సార్లు చెప్పాను. అతడి లాంటి ఆటగాడిని ఏ కెప్టెన్‌ అయినా తమ జట్టులో ఉండాలనుకుంటాడు. అతడు గట్టి పోటీనిచ్చే క్రికెటర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ప్రత్యర్థి జట్టుగా కోహ్లీతో ఆడటం సవాలుగా ఉంటుంది. అయితే, తన ఆటతో అవతలి వారికి చికాకు, విసుగు తెప్పిస్తాడు. అతడితో నాలుగేళ్ల క్రితం వైరం మొదలైంది. నేనెప్పటికీ గుర్తుంచుకునే ఆటగాళ్లలో కచ్చితంగా టీమ్‌ఇండియా సారథి ఒకడు’ అని పైన్‌ పేర్కొన్నాడు. కాగా, ఆ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య అనేక మాటల తూటాలు పేలాయి. నువ్వా-నేనా అనే రీతిలో పోటీపడినా భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని