WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఆ జట్టే ఫేవరెట్‌గా ఉంది: వసీమ్ అక్రమ్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)లో భారత్‌ కంటే ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

Published : 05 Jun 2023 23:57 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్‌ 7నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో భారత్, ఆసీస్‌ తలపడనున్నాయి. ఈ కీలక పోరు కోసం క్రికెట్ అభిమానులతో మాజీ ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై పలువురు మాజీలు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ కంటే ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్  (Wasim Akram) అభిప్రాయపడ్డాడు. ఓవల్‌ పిచ్‌ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుందని, బౌన్స్‌ ఎక్కువగా లభిస్తుందని పేర్కొన్నాడు. కాబట్టి.. భారత బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాలని వసీమ్ అక్రమ్ సూచించాడు.

‘‘ఓవల్‌ మైదానంలో సాధారణంగా టెస్టు మ్యాచ్‌లు ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి లేదా రెండవ వారంలో జరుగుతాయి. అప్పుడు పిచ్‌ చాలా పొడిగా ఉంటుంది. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్‌ ఆరంభంలో జరుగుతుంది. పిచ్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఎక్కువ బౌన్స్ ఉంటుంది. దీంతో బంతి ఎక్కువగా బౌన్స్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కూకబుర్ర బంతి కంటే  డ్యూక్‌ బాల్‌ చాలా ఎక్కువగా స్వింగ్ అవుతుంది. కూకబుర్ర కంటే చాలా గట్టిగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అని వసీమ్ అక్రమ్ అన్నాడు. సాధారణంగా టెస్టు క్రికెట్‌లో కూకబుర్ర బంతిని ఉపయోగిస్తారు. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో డ్యూక్‌ బంతిని వినియోగించనున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని