AUS vs IND: ఆసీస్‌కు ఎక్కువగా వారిద్దరి గురించే ఆందోళన : రికీ పాంటింగ్
మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) కోసం భారత్ - ఆస్ట్రేలియా (AUS vs IND) జట్లు సాధనను షురూ చేశాయి. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డులు కలిగిన భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా. మరోసారి ఆసీస్‌పై ఆధిక్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విరాట్, పుజారా కీలకమవుతారని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. వీరిద్దరి గురించే ఆస్ట్రేలియా శిబిరం ఎక్కువగా చర్చించుకుంటుందని తెలిపాడు.
‘‘భారత జట్టులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా అనుభవం ఉన్న ఆటగాళ్లు. వీరిద్దరి గురించి ఆసీస్ శిబిరం ఆందోళనకు గురవుతోంది. విరాట్, పుజారా రికార్డు ఆ స్థాయిలో ఉంది. ఆస్ట్రేలియా మీద పుజారా నాణ్యమైన ప్రదర్శన చేశాడు. ఓవల్‌లోనూ ఆసీస్ పిచ్ మాదిరి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి, పుజారాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ బెంగళూరు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు’’ అని పాంటింగ్ వెల్లడించాడు.
హేజిల్‌వుడ్ బదులు బొలాండ్: ఆసీస్ చీఫ్ సెలెక్టర్
కీలకమైన టెస్టులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్‌ను తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్, కామెరూన్ గ్రీన్‌తో కూడిన పేస్ దళం ఆసీస్ సొంతమని చెప్పాడు. ఇంగ్లాండ్ పిచ్ కండీషన్లు బొలాండ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, అందుకే తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు