Cricket: క్రికెట్‌ చరిత్రలో అరుదైన సంఘటన.. ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది మందితో బౌలింగ్!

మహిళల ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

Published : 27 Jan 2023 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సాధారణంగా ఏ క్రికెట్‌ మ్యాచ్‌లోనైనా ఐదు లేదా ఆరుగురు బౌలర్లతో బౌలింగ్‌ చేయిస్తాడు కెప్టెన్‌. అప్పుడప్పుడు ఏడుగురు బౌలర్లను  వినియోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ, ఓ కెప్టెన్‌ ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్‌ చేయించి రికార్డు సృష్టించారు. ఈ అరుదైన సంఘటన గురువారం మహిళల ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటు చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్ లానింగ్ తొమ్మిది మందితో బౌలింగ్‌ చేయించింది. వికెట్‌ కీపర్‌ బెత్‌ మూనీ, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్ మినహా మిగతా జట్టు సభ్యులందరూ బౌలింగ్‌ చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది బౌలింగ్‌ చేయడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే.. పాక్‌ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 12.4 ఓవర్లలోనే ఛేదించింది.  

ఒకే ఇన్నింగ్స్‌లో 9 మంది బౌలర్లను ఉపయోగించిన జట్లు

  • పాపువా న్యూ గినియా.. బెర్ముడాపై (అక్టోబర్‌ 19,2019)
  • డెన్మార్క్‌.. జర్మనీపై (అక్టోబర్‌ 20,2021)
  • కేమాన్ దీవులు.. బహామాస్‌పై (ఏప్రిల్ 17,2022)
  • దక్షిణ కొరియా.. ఇండోనేసియాపై (అక్టోబర్‌ 15,2022)
  • సెయింట్ హెలెనా.. బోట్స్‌వానాపై (నవంబర్‌ 25,2022)
  • సియారా లియోన్.. కామెరూన్‌పై (డిసెంబరు 2,2022) 
  • ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌పై.. (జనవరి 26,2023)(మహిళా జట్టు మ్యాచ్‌‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు