IND vs AUS: టీమ్‌ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే, మొదటి రెండు వన్డేల్లో గెలిచిన టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Published : 27 Sep 2023 21:44 IST

రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే, మొదటి రెండు వన్డేల్లో గెలిచిన టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్‌ శర్మ (81; 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించగా.. విరాట్ కోహ్లీ (56; 61 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదాడు. గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన శ్రేయస్ అయ్యర్ (48; 43 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (26; 30 బంతుల్లో), జడేజా (35; 36 బంతుల్లో) దూకుడుగా ఆడకపోవడంతో టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ (8) కూడా నిరాశపర్చాడు. ఆసీస్‌ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 4, హేజిల్‌వుడ్ 2, మిచెల్ స్టార్క్‌, కమిన్స్‌, కామెరూన్ గ్రీన్‌, తన్వీర్‌ సంఘా ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్‌ (96; 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (74; 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), లబుషేన్ (72; 58 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్‌దీప్ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని