గబ్బా టెస్ట్‌: టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ గబ్బా వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఓ వైపు గాయాలతో సతమవుతున్న భారత్‌...

Updated : 15 Jan 2021 06:53 IST

ఇరు జట్లకు కీలకంగా మారిన నాలుగో టెస్టు

 

బ్రిస్బేన్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ గబ్బా వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఓ వైపు గాయాలతో సతమవుతున్న భారత్‌.. మరోవైపు గెలవాల్సిన మ్యాచ్‌ (మూడో టెస్ట్‌)ను డ్రాగా చేసుకున్న ఆసీస్‌ తలపడనున్నాయి. టాస్‌‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జట్టు కూర్పు కోసమే ఇబ్బంది పడిన భారత్‌ నాలుగో టెస్ట్‌లోనూ నిలకడగా రాణించాలని ఆశిస్తోంది. స్వదేశంలో టీమిండియాను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది. 

ఇప్పటికే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌, ఆసీస్‌ 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్టును టీమిండియా ఓడిపోగా.. రెండో మ్యాచ్‌ గెలిచింది. మూడోది డ్రాగా ముగిసింది. ఇక నాలుగో టెస్టు ఆడటానికి భారత్‌ నుంచి 11 మంది ఉంటారా? అనే పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. సిరీస్‌లో ప్రతి టెస్టుకు ముందు రోజే భారత జట్టు కూర్పును ప్రకటించేవారు. కానీ ఈ టెస్టు విషయానికి వచ్చేసరికి టాస్‌కు కాస్త ముందుగా వెల్లడించారు. 

టీమిండియా జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, మహ్మద్‌ సిరాజ్‌, టి. నటరాజన్‌. 

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ హారిస్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, టిమ్‌ పెయిన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయన్‌, జాష్‌ హేజిల్‌వుడ్‌



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని