రికీ పాంటింగ్ టీమ్‌నే అధిగమించారు
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది...
ఆస్ట్రేలియా మహిళా జట్టు సరికొత్త రికార్డు
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా 22వ మ్యాచ్ గెలుపొందింది. ఈ క్రమంలోనే 2003 నాటి రికీపాంటింగ్ టీమ్ రికార్డును బద్దలుకొట్టింది. పాంటింగ్ సేన అప్పట్లో వరుసగా 21 వన్డేలు వరుసగా విజయం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లారెన్ డౌన్(90; 134 బంతుల్లో 8x4) ఒంటరి పోరాటం చేసింది. మరోవైపు నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆపై బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలిస్సా హేలీ(65; 68 బంతుల్లో 7x4, 2x6), ఎలిసి పెర్రి(56*; 79 బంతుల్లో 7x4), ఆష్లీ గార్డ్నర్(53*; 41 బంతుల్లో 3x4, 3x6) తలా ఓ చేయి వేయడంతో సునాయాస విజయం సాధించింది. కాగా, 2018 మార్చి 12 నుంచి ఇప్పటివరకు మొత్తం 22 వన్డేల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ నేతృత్వంలో ఓటమే ఎరుగకుండా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే రికీపాంటింగ్ టీమ్ రికార్డును బద్దలుకొట్టింది.
అన్నీ క్లీన్స్వీప్లే..
* భారత్‌పై 3-0
* పాకిస్థాన్‌పై 3-0
* న్యూజిలాండ్‌పై 3-0
* ఇంగ్లాండ్‌పై 3-0
* వెస్టిండీస్‌పై 3-0
* శ్రీలంకపై 3-0
* న్యూజిలాండ్‌పై 3-0
* న్యూజిలాండ్‌పై 1-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్