IND vs AUS:ఈ భారత స్టార్‌ బ్యాటర్‌ను ఔట్‌ చేస్తే చాలు.. : హేజిల్‌వుడ్‌

క్రీడా స్ఫూర్తి కొరవడిన జట్టు ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా అని ఎక్కువ మంది క్రికెట్‌ అభిమానులు చెబుతుంటారు. వారి మీద ఎవరైనా బాగా ఆడితే అస్సలు ఓర్చుకోలేరు. ఇదే విషయంపై ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 28 Mar 2023 21:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడే బ్యాటర్లంటే ఆ జట్టు బౌలర్లకే కాదు.. ఆ దేశ అభిమానులకే నచ్చదు. ఎంతటి స్టార్ బ్యాటర్‌ అయినా సరే ద్వేషిస్తారని ఆసీస్‌ పేసర్‌ జోష్ హేజిల్‌వుడ్‌ వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా భారత నయా వాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అంటే తమ వారికి పడదని చెప్పాడు. ఇటీవలే పుజారా వంద టెస్టుల మైలురాయిని ఆసీస్‌పైనే అందుకోవడం గమనార్హం. అలాంటి పుజారా వికెట్‌ను తీసుకుంటే మాత్రం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుందని జోష్ పేర్కొన్నాడు. 

‘‘ఛెతేశ్వర్‌ పుజారాను ఔట్‌ చేస్తే వచ్చే థ్రిల్ మాటల్లో వర్ణించలేం. ఎప్పురైతే అతడి వికెట్‌ను దక్కించుకుంటారో.. జీవితంలో చాలా సాధించేసినట్లే. అయితే దాని కోసం తీవ్రంగా శ్రమించాలి. నేను చాలా సంవత్సరాలపాటు  అతడికి బౌలింగ్‌ చేశా.  ఆసీస్‌ అభిమానులు అతడిని ద్వేషించడాన్ని కూడా ఇష్టపడతారు. టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు’’ అని హేజిల్‌వుడ్‌ తెలిపాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తరఫున గత సీజన్‌లో హేజిల్‌వుడ్‌ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. అయితే గాయం కారణంగా భారత్‌ టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన హేజిల్‌వుడ్‌ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2023 సీజన్‌కు అందుబాటులో ఉండటం అనుమానమే. నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని టీమ్‌ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. ఆసీస్‌ 2-1 తేడాతో గెలుచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని