IND vs SA: ఈ ప్రదర్శన మా నాన్నకు అంకితం: అవేశ్‌ ఖాన్

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు...

Published : 18 Jun 2022 10:09 IST

రాజ్‌కోట్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు.  ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయలేకపోయిన అతడు ఈ మ్యాచ్‌లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అవేశ్‌ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు.

‘ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. మా నాన్న పుట్టినరోజు కూడా నేడే. నా అత్యుత్తమ ప్రదర్శనను ఆయనకు అంకితమిస్తున్నా. ఇక్కడ నేనేం ప్రణాళికలు రచించలేదు. సహజసిద్ధంగా బౌలింగ్‌ చేసి వికెట్లకేసి విసరాలనుకున్నా. ఈ పిచ్‌ వైవిధ్యంగా ఉంది. బంతి కొన్నిసార్లు బౌన్స్‌ అయ్యింది.. కొన్నిసార్లు కింద నుంచి వెళ్లింది. దీంతో కాస్తంత బౌన్స్‌ ప్రదర్శించి సరైన లెంగ్త్‌లో వేయాలనుకున్నా. అలాగే రిషభ్‌ పంత్‌ కూడా పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్‌ చేయాలో చెప్పాడు. దాంతో జాన్సెన్‌, మహారాజ్‌ల వికెట్లు సాధించా. మరోవైపు జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. ఫీల్డింగ్‌, బౌలింగ్‌ బాగా చేస్తున్నాం. దీంతో ఆఖరి మ్యాచ్‌ను కూడా ఆస్వాదించాలనుకుంటున్నాం. అక్కడ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌. మేం విజయం సాధించడానికి తప్పకుండా కృషి చేస్తాం’ అని అవేశ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని