Rishabh Pant: నాలాంటి బుద్ధిమంతుడు లేనేలేడు

పంత్‌ పంచుకున్న ఓ పోస్టు నవ్వులు పూయిస్తోంది. టెస్టు సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న పంత్‌.. రంగురంగుల హుడీ, షార్ట్‌తోపాటు రెండు కలర్ల....

Published : 24 Aug 2021 01:45 IST

నవ్వులు పూయిస్తున్న అక్షర్‌ పటేల్‌, ఇశాంత్‌ శర్మ కామెంట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ క్రికెట్‌ ఫీల్డ్‌లో ఓ ఫైర్ బ్రాండ్‌.. ప్రత్యర్థులను కవ్విస్తుంటాడు. మాటకు మాట బదులిస్తూనే ఉంటాడు. కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో, బయట మాత్రం సరదాగా ఉంటాడు. తన చర్యలతో అందరినీ నవ్విస్తుంటాడు. తాజాగా పంత్‌ పంచుకున్న ఓ పోస్టు నవ్వులు పూయిస్తోంది. టెస్టు సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న పంత్‌.. రంగురంగుల హుడీ, షార్ట్‌తోపాటు రెండు కలర్ల (ఎరుపు, నీలం) సాక్సులు ధరిచి కాస్త విచిత్రంగా ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. ‘క్లాస్‌లో అందరికంటే బుద్ధిమంతుడు’ అంటూ హిందీలో రాసుకొచ్చాడు. నవ్వుతున్న ఎమోజీలను కూడా జతచేశాడు.

పంత్‌ కామెడీ పోస్టుపై.. మరో క్రికెటర్‌, ఐపీఎల్‌ జట్టు సభ్యుడు అక్షర్‌ పటేల్‌ అంతే కామెడీగా స్పందించాడు. ఆ ఫొటోను తానే తీశానని తెలియజేసేలా.. ‘బుద్ధిమంతుడివి నువ్వు కాదు ఆ ఫొటో తీసిన వ్యక్తి’ అంటూ కామెంట్ చేశాడు. అక్షర్‌ కామెంట్‌పై మరో దిల్లీ క్యాపిటల్‌  సభ్యుడు ఇశాంత్‌ శర్మ సెటైర్‌ వేశాడు. మీరిద్దరూ అమాయకులా? అన్నట్లు తెలిపేలా కామెంట్‌ పెట్టాడు. ఈ క్రికెటర్ల సంభాషణ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

టీమ్‌ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. వర్షం కారణంగా మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తోపాటు షమి, బుమ్రా అద్భుత పోరాటం.. సిరాజ్‌ సంచలన బౌలింగ్‌తో రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈనెల 25 నుంచి జరగనున్న మూడో టెస్టులోనూ ఇదే ఊపు కొనసాగించి ఐదు టెస్టుల సిరీస్‌లో లీడ్‌ తీసుకోవాలని కోహ్లీ సేన ఆశిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని