Published : 20 Aug 2022 01:33 IST

Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్‌ కష్టమే: భారత మాజీ ఆటగాడు

ఇంటర్నెట్ డెస్క్‌: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ పది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ అక్షర్ పటేల్ (3/24) అద్భుత ప్రదర్శన చేశాడు. ఇటీవల కాలంలో తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అక్షర్‌ ముందుంటున్నాడు. బౌలింగ్‌తోపాటు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ జట్టుకు సాయపడుతున్నాడు. అయితే ఆల్‌రౌండర్ల జాబితాలో జట్టులో స్థానం కోసం సీనియర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా పోటీపడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా జడేజా, అక్షర్‌ ఒకేలా బౌలింగ్‌ యాక్షన్‌ ఉండటంతో సీనియర్‌ వైపే టీమ్ఇండియా మొగ్గు చూపుతుంది. ఈ క్రమంలో జడేజా ఫిట్‌ ఉండి అందుబాటులో ఉన్నంతవరకు అక్షర్‌ పటేల్‌కు కీలక టోర్నీల్లో అవకాశం రావడం కష్టమేనని మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

‘‘ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్ పరిస్థితి చూస్తే ఏమనాలో తెలియడంలేదు. ఎందుకంటే జట్టులో స్థానం కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటికీ రవీంద్ర జడేజాకు షాడోగానే ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరూ బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయగల సమర్థులు. రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండి టీమ్‌ కోసం అందుబాటులో ఉంటే మాత్రం అక్షర్‌కు చోటు దక్కడం కష్టమే. అయితే వచ్చిన ఛాన్స్‌ అందిపుచ్చుకుంటూ సూపర్‌గా రాణిస్తున్నాడు. ఇక కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. అతడి నుంచి వికెట్లు ఆశించడంలో తప్పులేదు. కానీ,  జింబాబ్వేతో తొలి వన్డేలో మాత్రం పిచ్‌ అతడికి సహకరించలేదు. అయినా పరుగులు నియంత్రించగలిగాడు. కుల్‌దీప్‌ కొంచెం వేగంగా బంతిని వదులుతున్నట్లు అనిపించింది’’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. శనివారం జింబాబ్వేతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ఆడనుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని