Axar Patel: జస్ప్రీత్‌ బుమ్రా రికార్డును బద్దలు కొట్టిన అక్షర్‌ పటేల్

ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ (Axar Patel) టెస్టుల్లో వేగంగా 50  వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు.

Updated : 14 Mar 2023 20:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ (Axar Patel) టెస్టుల్లో ఓ మంచి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)ను అధిగమించి సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (90)ని పెవిలియన్‌కు పంపి అక్షర్‌ ఈ ఘనతను అందుకున్నాడు. బుమ్రా 2,465 బంతుల్లో 50 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ 2,205 బంతుల్లోనే ఈ మార్క్‌ను చేరుకున్నాడు. 

అక్షర్‌ పటేల్ ఈ సిరీస్‌లో బంతి పెద్దగా ప్రభావం చూపకపోయినా బ్యాట్‌తో మాత్రం అదరగొట్టాడు. సిరీస్‌లో అత్యధిక పరుగుల చేసిన వారి జాబితాలో ఉస్మాన్ ఖావాజా (333), విరాట్ కోహ్లీ (297) తర్వాత 264 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇందులో రెండు వికెట్లు నాలుగో టెస్టులో తీసినవే. 

టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్లు (భారత్)

  • అక్షర్‌ పటేల్ - (2,205 బంతుల్లో)
  • జస్ప్రీత్‌ బుమ్రా - (2,465 బంతుల్లో)
  • కర్సన్ ఘవ్రి - (2,534 బంతుల్లో)
  • రవిచంద్రన్‌ అశ్విన్‌ - (2,597 బంతుల్లో)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు