Babar Azam: కోహ్లీ మేటి రికార్డును బద్దలుకొట్టిన బాబర్‌ అజామ్

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు...

Published : 10 Jun 2022 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అజామ్‌ ఇప్పుడు దాన్ని 13 ఇన్నింగ్సుల్లోనే పూర్తి చేశాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అతడు 103 పరుగులు సాధించి ఈ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్‌ 18 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలవగా.. కేన్‌ విలియమ్సన్‌ 20 ఇన్నింగ్స్‌, అలిస్టర్‌ కుక్‌ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మరోవైపు బాబర్‌ ఈ శతకంతో వన్డేల్లో రెండోసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇది వరకు 2016లో ఇదే వెస్టిండీస్‌ జట్టుపై యూఏఈలో 120, 123, 117 పరుగులు సాధించిన అతడు.. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 114, 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా విండీస్‌పైన మరో శతకం బాది సత్తా చాటాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీబియన్‌ జట్టు 305/8 భారీ స్కోర్‌ సాధించింది. షై హోప్‌ 127తో రాణించాడు. పాకిస్థాన్‌ జట్టులో బాబర్‌తో పాటు రిజ్వాన్‌ (59), ఖుష్‌దీ షా (41) మెరవడంతో నాలుగు బంతులు మిగిలుండగానే గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని