
T20 World Cup: జయాపజయాలను మనం నిర్ణయించలేం : బాబర్ ఆజామ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న పాకిస్థాన్ జోరుకు.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కళ్లెం వేసింది. మాథ్యూ వేడ్ (41) సంచలన ఇన్నింగ్స్‌తో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంటే.. ఓటమి పాలైన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడాడు. ప్రయత్నమొక్కటే మన చేతుల్లో ఉందని, జయాపజయాలను మనం నిర్ణయించలేమని సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ట్విటర్లో పంచుకుంది.
‘ఈ బాధ వర్ణించలేనిది. విజయం కోసం ప్రయత్నించడమొక్కటే మన చేతుల్లో ఉంది. జయాపజయాలను మనం నిర్ణయించలేం కదా. అందుకే, ఈ ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తించాలి. మళ్లీ ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. మనకు ఎవరూ మన లోపాల గురించి చెప్పరు. మనమే వాటిని తెలుసుకోవాలి. ఈ ప్రపంచకప్‌లో మనమంతా సమష్టిగా రాణించాం. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో జట్టుగా ముందుకు సాగాలి. ఎవరినీ వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. మనమంతా సమష్టిగా విఫలమయ్యాం. ఇందుకు ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఓటమితో మనం కుంగిపోకూడదు. ప్రతి ఒక్కరికీ నేను అండగా ఉంటాను. మనమంతా ఓ కుటుంబం. ప్రతి ఒక్కరూ విజయం కోసం ప్రయత్నించాలి. గెలుపోటముల్లో అందరూ పాలు పంచుకోవాలి’ అని బాబర్ ఆజామ్ చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.