Babar - Virat: విరాట్ అలా చెప్పడం.. నాకు గర్వకారణం.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా: బాబర్ అజామ్
భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్లు మైదానంలో దిగితే విజయం కోసం తీవ్రంగా పోరాడతాయి. ఒక్కసారి మ్యాచ్ ముగిశాక.. క్రికెటర్ల మధ్య స్నేహబంధం ఉంటుందనేది విరాట్ కోహ్లీ - బాబర్ అజామ్ (Virat Kohli) మాటలనుబట్టి తెలిసిపోతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) సంబరం మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డును అధిగమించాడు. ఇక శనివారం భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. వరల్డ్ కప్‌కు ముందు బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్లను పరీక్షించుకునేందుకు పెద్ద టీమ్‌లకు ఇదొక చక్కటి వేదికగా నిలవనుంది. ఈ క్రమంలో గతంలో విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ అజామ్ (Babar Azam) స్పందించాడు. ఆ వీడియోను ఆసియా కప్ (Asia Cup 2023) అధికారిక క్రీడా ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది.
ఆసియా కప్ అంటే ధోనీ గుర్తుకొస్తాడు.. ఎందుకంటే..?
‘‘ఎవరి దగ్గరి నుంచైనా పాజిటివ్ కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటివి లభిస్తే.. మాత్రం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏ ఆటగాడికైనా ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. 2019 వరల్డ్ కప్ (ODI World Cup) సందర్భంగా జరిగిన సంఘటనను కోహ్లీ చెప్పాడు. అప్పుడు విరాట్ కెరీర్ పరంగా ఉన్నతస్థాయిలో ఉన్నాడు. అతడి నుంచి నేర్చుకోనేందుకు అవకాశం ఉంటుందని అప్పట్లో కలిసేందుకు వెళ్లా. కోహ్లీ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్‌లో చాలా ఉపయోగపడ్డాయి’’ అని బాబర్ తెలిపాడు.
బాబర్ గురించి విరాట్ మాటల్లో..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పరిచయం గురించి కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘తొలిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు బాబర్ పట్ల ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు. అతడికీ నాపై ఇలానే కొనసాగుతోంది. ప్రస్తుతం బాబర్ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్నాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. అతడి ఆటను చూస్తూ నేనూ ఎంజాయ్ చేస్తా. ఇప్పటికీ నాతో బాబర్ ప్రవర్తించే తీరు ఏమాత్రం మారలేదు’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా