IPL 2023: సన్‌రైజర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. తొలి మ్యాచ్‌కు కీలక ఆటగాడు దూరం

 ఐపీఎల్‌-16 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ఏప్రిల్ 2న రాజస్థాన్‌ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ అందుబాటులో ఉండట్లేదు.   

Published : 30 Mar 2023 20:17 IST

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) అభిమానులకు బ్యాడ్ న్యూస్‌. ఐపీఎల్‌-16 (IPL) సీజన్‌లో ఆరెంజ్‌ ఆర్మీకి ఏడెన్‌ మార్‌క్రమ్‌ (Aiden Markram)ను కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో ఏప్రిల్‌ 2న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌కు మార్‌క్రమ్‌ అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఈ మ్యాచ్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున నెదర్లాండ్స్‌తో రెండు వన్డేల సిరీస్‌లో మార్‌క్రమ్‌ ఆడనున్నాడు. ఈ సిరీస్‌ దక్షిణాఫ్రికాకు కీలకం. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా నేరుగా అర్హత సాధించాలంటే నెదర్లాండ్స్‌ను 2-0 తేడాతో ఓడించాలి. 

దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ మధ్య ఏప్రిల్ 2న రెండో వన్డే జరగనుంది. ఏప్రిల్ 3న మార్‌క్రమ్ భారత్‌ చేరుకుంటాడు. ఏప్రిల్ 7న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు.2013 నుంచి సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతున్న భువనేశ్వర్‌ కుమార్‌ ఇంతకుముందు కూడా కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 2019 సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు, 2022లో ఒక మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఈ ఏడింటిలో హైదరాబాద్‌ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి మిగతా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు