NZ vs SL: గాలి దిశగా బంతులు..కివీస్-లంక రెండో టెస్టుకు తిప్పలు
సోమవారం వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో వింత పరిణామం చోటుచేసుకుంది. గాలులు అధికంగా వీయడంతో బంతి గింగిరాలు తిరిగి బౌలర్లను, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది.
వెల్లింగ్టన్: వాతావరణ మార్పుల వల్ల అధికంగా వీచిన గాలులు బౌలర్లను ముప్పుతిప్పులు పెట్టాయి. బంతుల్ని ఓ వైపు వేస్తే అవి గాలి వీచే దిశగా పరుగులు పెట్టాయి. సోమవారం వెల్లింగ్టన్‌లో(Wellington) న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ వింత పరిణామం చోటుచేసుకుంది.
సోమవారం 113/2 వద్ద లంక రెండో ఇన్నింగ్స్‌ను పునఃప్రారంభించింది. 121వ ఓవర్ వద్ద లంక ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండగా గాలులు అధికంగా వీచాయి. కివీస్ బౌలర్ మైఖేల్ బ్రాస్‌వెల్(Michael Bracewell) స్టంప్స్ కిందకి బంతిని విసిరాడు. అదే సమయంలో అధికంగా గాలి వీయడంతో బంతి గింగిరాలు తిరుగుతూ గాలి దిశగా పరుగులు పెట్టింది. బ్యాటర్ ప్రభాత్ జయసూర్యకు(Prabath Jayasuriya) అందనంత దూరంగా వెళ్లి కీపర్ చేతికి చిక్కింది. గాలుల ధాటికి అటు బ్యాటింగ్ పరంగా ఇటు బౌలింగ్ పరంగా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. కివీస్ 580 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసి లంక రెండో ఇన్నింగ్స్‌లో 385 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 58 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ 2-0 తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా