BAN VS ZIM: బంగ్లా టైగర్స్‌ను బెంబేలెత్తిస్తోన్న జింబాబ్వే..! 9 ఏళ్ల తర్వాత తొలిసారి!
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌కు జింబాబ్వే పర్యటనలో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన బంగ్లా.. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ను సైతం ఓడిపోయింది. హరారే వేదికగా ఈ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 303 పరుగులు చేసింది. అయినా, ఈ స్కోరు జింబాబ్వే బ్యాటర్లకు సరిపోలేదు. సికందర్ రజా, ఇన్నోసెంట్ కైయా అద్భుతమైన సెంచరీలతో 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి బంగ్లాకు షాక్ ఇచ్చారు. తొలుత బంగ్లా టాప్ 4 బ్యాటర్లు తమీమ్ ఇక్బాల్ లిట్టన్ దాస్, అనాముల్ హక్ , ముష్ఫికర్ రహీమ్ అర్ధశతకాలు సాధించడం విశేషం. మరోవైపు జింబాబ్వే ఛేదనలో 62 పరుగులకే 3 టాప్‌ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. అయితే సికందర్ రజా (135 నాటౌట్,109 బంతుల్లో; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకం, కైయా (110) కలిసి జింబాబ్వేకు గొప్ప విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర రికార్డులు..!
* ఒక జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, మ్యాచ్ ఓడిపోవడం వన్డే క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి. ఇంతకముందు పాక్, విండీస్, సఫారీ జట్లు ఈ విధంగానే పరాజయం చెందాయి.
* వన్డేల్లో జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌పై తొమ్మిదేళ్ల తర్వాత గెలుపొందింది. అంతేకాదు.. ఇంతకముందు బంగ్లాదేశ్‌తో వరుసగా 19 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన జింబాబ్వే.. ఈ మ్యాచ్‌తో ఆ చెత్త రికార్డుకు బ్రేక్ వేసింది.
* బంగ్లాపై 2017 తర్వాత 300+ పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మాత్రమే ఛేదించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం 2017 తర్వాత జింబాబ్వేకు కూడా ఇదే తొలిసారి.
* జింబాబ్వే తరుఫున నాలుగో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రజా, కైయా 25 ఏళ్ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జోడీగా నిలిచారు. ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన రెండో జింబాబ్వే జోడీగా వీరిద్దరూ మరో రికార్డు సృష్టించారు.
* బంగ్లా సారథి తమీమ్ ఇక్బాల్ ఈ మ్యాచ్‌లో 8000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ ఈ మ్యాచ్‌తోనే 5000 పరుగుల మార్క్‌ను చేరుకొన్నాడు.
బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ గెలవడం కూడా జింబాబ్వేకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Shashi Tharoor: శశిథరూర్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం